కొల్లిపరలో భారీ వర్షం

కొల్లిపర మండల గ్రామాలలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో సేద తీరారు. ఆకస్మిక వర్షం కారణంగా వ్యాపారస్తులు, పాదచారులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద, టవర్లు, పోల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో ఉండరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్