పొన్నూరు: త్రాగునీరు వృధాగా పోతున్న పట్టించుకోరా

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు యూనియన్ బ్యాంక్ వద్ద మున్సిపాలిటీ భూగర్భ నీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో తాగునీరు వృధాగా పోతోంది. శుక్రవారం స్థానిక ప్రజలు మాట్లాడుతూ, రెండు నెలలుగా నీరు వృధా అవుతున్నా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నీరు కలుషితం కాకముందే అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్