గుంటూరు జిల్లా పొన్నూరు మండలం లోని నండూరు, ఉప్పరపాలెం, చిన్న ఇటికంపాడు, ఆరెమండ, మామిళ్ళపల్లి గ్రామాలలో శుక్రవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సూచనల మేరకు కూటమి శ్రేణులు తుఫాను బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం 25kg, కందిపప్పు 1kg, వంటనూనె 1kg, ఉల్లిపాయలు 1kg, బంగాళా దుంపలు 1kg, చక్కెర 1kg లబ్ధిదారులకు అందించారు. మండలంలో మొత్తం 162 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందచేశారు.