ప్రజలు వ్యాధుల బారిన పడకుండా, వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉందని ఎంపీడీవో టి. ఊహారాణి అన్నారు. తుఫాన్ అనంతరం పారిశుద్ధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె సూచించారు. గురువారం డిప్యూటీ ఎంపీడీవో, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, ఎంసీఓ, ఎస్బీఎంలతో కలిసి పాత రెడ్డిపాలెం, కొత్త రెడ్డిపాలెం గ్రామాల్లో పర్యటించి, త్రాగునీటిని క్లోరినేషన్ చేసి సరఫరా చేయాలని ఆదేశించారు.