పొన్నూరు మండలం నండూరు, పెదపాలెం గ్రామాలలో బుధవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఐ. శ్రీకాంత్ పాల్గొన్నారు. వరి పైరు గింజపాలు పోసుకునే దశలో ఉందని, అధిక వర్షాల వల్ల మాని పండు తెగులు, మెడ విరుపు తెగులు రాకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎకరాకు 250 ml ప్రోపికొనాజోల్ (టీల్ట్) లేదా వాలిడా మైసిన్ 400 ml పిచికారి చేయాలని తెలిపారు.