గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామానికి చెందిన సంఘన పరమేశ్వరమ్మ (65) మనస్పర్థల కారణంగా గత శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. బంధుమిత్రులు వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ నరహరి మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9949716519, 7997554986 నంబర్లకు తెలియజేయాలని కోరారు.