ప్రత్తిపాడు: తుఫాను ప్రభావంను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు

గురువారం ప్రత్తిపాడులో తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అధికారులు, కూటమి నాయకులు తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుగానే హెచ్చరించడంతో, ప్రభుత్వం వెంటనే స్పందించి సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు సహాయంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్