ప్రతిపాడు: నల్లమడవాగు ఆధునికరణ చేపట్టాలి రైతు సంఘం

నల్లమడ వాగులో 55,000 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అడ్డుగా పనులు చేపట్టడంతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియకు సోమవారం నల్లమడ రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందించారు. కొల్లా రాజమోహన్ రావు, యార్లగడ్డ అంకమ్మ చౌదరి, లావు అంకమ్మ చౌదరి, హరిబాబు, ఇతర రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రాఫ్ట్ నమోదు చేసి, నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్