రేపల్లె: దోమలు వృద్ధి చెందకుండా డ్రై డే ని పాటించాలి

బాపట్ల జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. చుక్కా రత్న మన్మోహన్ మంగళవారం రేపల్లె మండలం మోళ్లగుoళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మొంథా తుఫాన్ అనంతరం గ్రామాల్లో జ్వరాలు, అతిసార ప్రబలే అవకాశం ఉన్నందున, దోమలు పెరగకుండా డ్రైడే పై ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. చంటి పిల్లల వ్యాధి నిరోధక టీకాల పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్