శుక్రవారం నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్. కాలేషా, రేపల్లె పట్టణ సీ. ఐ. మల్లికార్జునరావును కలిసి దివ్యాంగులపై నిత్యం జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించారు. జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ. పీ. ప్రధాన కార్యదర్శి ఎస్. రమేష్ కూడా పాల్గొన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు.