రేపల్లె మండలం మోర్ తోట గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం తాసిల్దార్ ఎం శ్రీనివాసరావు, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించిన ఆమె, కృష్ణా నదిలో స్నానానికి వెళ్లే భక్తులకు ప్రమాదం జరగకుండా స్పిమ్మర్ బోట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.