సత్తెనపల్లిలో లాడ్జి ఓనర్లకు పోలీసుల హెచ్చరిక

సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం లాడ్జి యజమానులు, మేనేజర్లతో సమావేశమై, అతిథుల ఐడి ప్రూఫ్, వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. లాడ్జిల్లో పేకాట, మద్యం సేవించడం, మైనర్లకు గదులు ఇవ్వడం నిషేధమని హెచ్చరించారు. ఉదయం 7 గంటలకు వచ్చి మరుసటి రోజు 7 గంటలకు వెళ్లే వారి పూర్తి వివరాలు పోలీసులకు అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలను అరికట్టడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్