తుళ్లూరులోని టిడ్కో గృహ సముదాయంలో మంగళవారం మద్యం మత్తులో ఉన్న అబ్బాస్ అనే వ్యక్తి తన గొంతు కోసుకుని స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా నిరాకరించాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.