కొలకలూరులో తీవ్ర విషాదం

తెనాలి మండలం కొలకలూరులో బుధవారం మధ్యాహ్నం బీ ఫార్మసీ విద్యార్థిని SK మసూరీ (20) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే రోజు సాయంత్రం, గ్రామానికి చెందిన షేక్ ఖాజా (20) కొమ్మమూరు కాల్వలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాల్వలో గల్లంతైన ఖాజా ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్