తెనాలి: వ్యభిచార గృహ నిర్వాహకులకు జైలు

తెనాలి మండలంలోని కరెవరానికి చెందిన గపూర్, దుర్గాభవాని దంపతులు విశాఖకు చెందిన ఓ మహిళను మాయమాటలు చెప్పి వ్యభిచారానికి ప్రోత్సహించినట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు దాడి చేసి దంపతులను అరెస్ట్ చేశారు. వారిని తెనాలి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. బాధితురాలిని వసతి గృహానికి తరలించినట్లు ఎస్సై ఆనంద్ మంగళవారం వెల్లడించారు.

సంబంధిత పోస్ట్