వరద బాధితులకు ఎమ్మెల్యే ఆనందబాబు భరోసా

గురువారం వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కొల్లూరు మండలంలోని లంక గ్రామాలలో వరదలకు మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు. తిప్పలగట్ట గ్రామంలో కోతకు గురవుతున్న పొలాలను చూసి, వరదలు తగ్గిన తర్వాత పంట నష్టాన్ని నివారించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్