బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి కొల్లూరు మండలంలోని కృష్ణా వరద ప్రభావిత లంక గ్రామాలను సందర్శించి, రైతులు, గ్రామస్తులతో గురువారం సమావేశమయ్యారు. వరదల వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే పంట నష్టం అంచనాలను సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.