వినుకొండ ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

వినుకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మొంథా తుఫాన్ కారణంగా వాగులు పొంగి రోడ్లు కొట్టుకుపోయాయి. గుళ్లకమ్మ వాగు ఉదృతి ఇంకా కొనసాగుతోంది. పట్టణంలోని శ్రీ గంగాపార్వతి సమేత రామలింగేశ్వరస్వామి వారి కొండ రహదారి అయిన ఘాట్ రోడ్డు కూడా అస్తవ్యస్తంగా మారింది. తుఫాను ప్రభావంతో కొండచరియలు, రాళ్లు విరిగి ఘాట్ రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని మంగళవారం స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్