వినుకొండ టీడీపీ కార్యాలయంలో మంగళవారం, ఎమ్మెల్యే జీవీ మొంథా తుఫాను వల్ల జరిగిన నష్టంపై సమీక్ష నిర్వహించారు. ఆర్&బి, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖల అధికారులతో జరిగిన ఈ చర్చలో విద్యుత్, రోడ్డు, పంట నష్టాల వివరాలను ఆయన తెలుసుకున్నారు. నష్టం జరిగిన ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి, ప్రజలకు వెంటనే సేవలు పునరుద్ధరించాలని అధికారులను ఎమ్మెల్యే జీవీ ఆదేశించారు.