టీడీపీకి జీవీ రెడ్డి రాజీనామా.. ఆ వృత్తిపై ఫోకస్

AP: టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి ఇటీవల జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అన్ని పదవులకు గుడ్ బై చెప్పిన ఆయన.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ క్రమంలో జీవీ రెడ్డి కొత్త జర్నీ ప్రారంభించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. జీవీ రెడ్డి అండ్ కో, అడ్వకేట్స్ సంస్థ విస్తరిస్తోంది. 0-5 ఏళ్ల అనుభవం ఉన్నవారు ఈ సంస్థలో చేరవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్