టీడీపీ నేతల వేధింపులు… మహిళ ఆత్మహత్యాయత్నం

AP: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువుపాళెం ఎస్సీ కాలనీకి చెందిన దారా విజయమ్మ.. స్థానిక టీడీపీ నేతలు విక్రమ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు తనను వేధించారని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహిళల పొదుపు సొమ్ము రూ.18 లక్షలు దుర్వినియోగం చేసిన సునీత అనే వీఓఏను తొలగించి, దారా కోటేశ్వరమ్మను నియమించగా, కూటమి పార్టీ నాయకులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చి సునీతనే తిరిగి వీఓఏగా నియమించారని ఆమె ఆరోపించారు.

సంబంధిత పోస్ట్