ఓ వ్యక్తి తన ప్రాణ స్నేహితుడినే చంపేందుకు యత్నించిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. తాటిపర్తికి చెందిన కుంపట్ల సూరిబాబు తన స్నేహితుడు రంపం గంగాధర్‌కు రూ.4లక్షలు అప్పు ఇచ్చాడు. ఈ క్రమంలో ఆ డబ్బు తిరిగిస్తానని చెప్పి సుద్దగెడ్డలోని ఓ వాగు దగ్గరికి తీసుకెళ్లి సూరిబాబును ముంచి చంపాలనుకున్నాడు. ‘ముగ్గురు పిల్లలున్నార్రా.. నన్నొదిలెయ్’ అని ప్రాధేయపడ్డా వినలేదు. వాగులో ఓ కేబుల్ తీగ పట్టుకుని బయటికొచ్చి సూరిబాబు ప్రాణాలు కాపాడుకున్నాడు.