AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మిథున్ రెడ్డి.. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కాగా, వైసీపీ హయాంలో ఎక్సైజ్ పాలసీలో మార్పులు, డిస్టిలరీల నుంచి లంచాల సేకరణ, వేల కోట్ల అక్రమ లాభాలకు సంబంధించిన కేసులో మిథున్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు.