భారీ వర్షం.. నీట మునిగిన పొలాలు!

పల్నాడు జిల్లాలో వ‌ర్షం దంచికొడుతోంది. రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం శనివారానికి తీవ్ర రూపం దాల్చడంతో పాఠశాలలకు కలెక్టర్ అరుణ్ సెలవు ప్రకటించారు. వర్షపు నీటి ఉధృతికి జిల్లాలోని అనేక మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వాగులు, చెరువులు సమీప పొలాల్లో అడుగు మేర వర్షపు నీరు ప్రవహిస్తోంది.

సంబంధిత పోస్ట్