నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఉత్తర బంగాళాఖాతంలో సోమవారానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా మారొచ్చని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ముఖ్యంగా సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్