ఏపీలో భారీ వర్షం (వీడియో)

AP: ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో నగరవ్యాప్తంగా వర్షం దంచికొడుతుంది. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుసింది. రాత్రి 7 గంటల నుంచి కుండపోత వర్షం పడుతుండటంతో, సిటీలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. అజిత్ సింగ్ నగర్, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, కనకదుర్గమ్మ గుడి పరిసర ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్, భవానిపురం ప్రాంతాల్లో భారీగా వాన పడుతోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్