AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాబోయే 3 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఈ మేరకు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. హోర్డింగ్స్, చెట్లకు దూరంగా ఉండాలని సూచించింది.