భారీ వర్షాలు.. కర్నూలు జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటన

AP: కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఇవాళ సెలవు ప్రకటించారు. బదులుగా వచ్చే రెండో శనివారం తరగతులు నిర్వహించాలని చెప్పారు. వర్షంలో విద్యార్థులు బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ యాజమాన్యాలు తప్పనిసరిగా సెలవు నిబంధన పాటించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్