AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో మరో 3 రోజులపాటు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షానికి శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ జలదిగ్బంధం అయింది. భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని స్కూళ్లకు, అంగన్వాడీలకు కలెక్టర్ స్విప్నిల్ దినకర్ సెలవు ప్రకటించారు.