AP: ద్రోణి ప్రభావం కారణంగా రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని తెలిపింది.