ఏపీలో భారీ వర్షాలు (వీడియో)

AP: 'మొంథా' తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ వర్షాలు మరిన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్