రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

AP: ప్రస్తుతం వాయవ్య, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే రేపు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్