పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారిందని APSDMA తెలిపింది. ఇది రేపు తీవ్ర వాయుగుండంగా మారి, ఎల్లుండి ఒడిశా పారాదీప్-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే అల్లూరి, తూ.గో, ప.గో, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.