హెలికాఫ్టర్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త మినీ ఎయిర్ పోర్టులను ప్లాన్ చేస్తుంది. విజయవాడ-శ్రీశైలం, హైదరాబాద్-శ్రీశైలం,అరకు-విశాఖపట్నం మార్గాల్లో హెలికాప్టర్ టూరిజంపై అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఆసక్తి ఉన్న ప్రైవేట్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. దరఖాస్తులను పరిశీలించి హెలిప్యాడ్‌లను ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు.