సత్యసాయి జిల్లాలో హై టెన్షన్

AP: శ్రీ సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రోజుల క్రితం దాడికి గురైన వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డి మంగళవారం ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారు పోటాపోటీగా జై జగన్, జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్