సంక్రాంతి నాటికి పేదలకు ఇళ్ళు

AP: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ 2029 నాటికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి నారాయణ తెలిపారు. పీఎంఏవై-1లో మంజూరైన 5 లక్షల ఇళ్లు రెండేళ్లలో పూర్తిచేయాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. పీఏంఏవై-2లో పట్టణ ప్రాంతాల్లో 40వేల ఇళ్లు మంజూరు చేశామని, వీటితోపాటు గృహనిర్మాణ శాఖకు చెందిన లక్ష గృహాలు, టిడ్కోకు చెందిన లక్ష గృహాలు సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్