AP: నారా భువనేశ్వరి లండన్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) డిస్టింగ్విష్డ్ అవార్డు, ది గోల్డెన్ పీకాక్ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన భార్యను చూసి గర్వంగా ఉందని, విలువలు, నాయకత్వంతో తెలుగు సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్న తీరు స్ఫూర్తిదాయకమని అభినందించారు. అంతర్జాతీయ అవార్డులతో తన తల్లిని, హెరిటేజ్ ఫుడ్స్‌ని సత్కరించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.