AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేసి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జోగి రమేశ్ అరెస్ట్‌పై వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరసన వ్యక్తం చేస్తున్నారు.