వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం చూడలేక భయంకర వాతావరణం సృష్టిస్తున్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయినా ఆయన మారలేదని అన్నారు. అయ్యన్నపాత్రుడు గురించి జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన్ని ఎదుర్కునే ఎదుర్కొనే ధైర్యం ఉంటే ఒకసారైనా అసెంబ్లీకి రావాలని అప్పుడు తాను జగన్‌కు సెల్యూట్ చేస్తానని ప్రకటించారు.