ఎక్కువసేపు మైక్‌ ఇస్తామంటే సభకొస్తా: జగన్

AP: వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘శాసనసభలో మాట్లాడేందుకు తగిన సమయమిస్తామని స్పీకర్ హామీ ఇస్తే.. మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే, సభకొస్తా’ అని జగన్ పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యేలందరితోపాటు మీకూ సమయమిస్తాం అని వాళ్లు అంటున్నారు.. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్లుగా కొన్ని నిమిషాల సమయమే మైక్ ఇస్తే ఏం మాట్లాడగలను, ప్రజా సమస్యలను సవివరంగా చెప్పగలనా?’ అని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్