AP: వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే వారి పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం. ఏడాది గడిచినా కూటమి నేతలు జగన్‌నే స్మరిస్తున్నారు. మరో రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. జగన్ సీఎం కాగానే మొదట తెరిచేది డిజిటల్ బుక్‌నే. కూటమి ప్రభుత్వం ప్రజలను పీడించడానికే అధికారంలోకి వచ్చింది’ అని విమర్శించారు.