అక్టోబర్ 15 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

AP: అక్టోబర్ 15 నుంచి విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు యాజమాన్యాలకు శుక్రవారం సాయంత్రం ఏపీ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నోటీసులు జారీ చేసింది. ఏడాదిన్నరగా నాలుగు డీఏలు, పీఆర్సీ, ఐఆర్‌ ఇవ్వకపోవడం, కనీసం చర్చలకు కూడా పిలవకపోవడంతో విసిగిపోయిన 33,582 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మెకు ముందు అక్టోబర్ 6, 8 తేదీల్లో ధర్నాలు, 13న చలో విజయవాడ, 14న వర్క్‌ టు రూల్‌ అమలు చేయనున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో చీకట్లు అలుముకుంటాయని ఉద్యోగులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్