AP: ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ కేపబిలిటీ సమ్మిట్‌లో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. పీపీపీ విధానంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరావతిలోనూ విమానాశ్రయం నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.