ఉన్నత విద్యకు వడ్డీ లేని రుణం: చంద్రబాబు

AP: ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిని కేంద్ర ప్రభుత్వం పావలా వడ్డీకి అందజేస్తున్న రుణాల పథకంతో అనుసంధానిస్తామని చెప్పారు. అన్ని వర్గాల వారికీ చేయూతనిచ్చేలా దీన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం కింద రుణాల మంజూరుకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని, 14 ఏళ్ల తర్వాత తీసుకున్న రుణం తిరిగి చెల్లించవచ్చన్నారు. వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్