మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు తీవ్ర అస్వస్థత?

AP: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను అమలాపురంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అమలాపురం ఇన్‌ఛార్జ్ పినిపే శ్రీకాంత్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులు, శ్రేణులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్