AP: అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైనప్పటికీ, తొలి రోజే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన కొంతమంది గైర్హాజరుకావడంతో ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి ఎమ్మెల్యేల సంఖ్య బలంతో పోలిస్తే తనకు సమర్థంగా కౌంటర్ ఇవ్వడం కష్టమనే భావనతో జగన్ సభకు వెళ్లలేదని టాక్. "జగన్ చంద్రబాబుకు భయపడ్డారా?" అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.