AP: మొన్నటివరకు రాయలసీమ మీద ఫోకస్ పెట్టిన కూటమి.. ఇప్పుడు ఓవర్ టు ఉత్తరాంధ్ర అంటోంది. జగన్ వాడిన అస్త్రాన్ని అతనికే తిరిగి పంచ్ ఇచ్చేలా వ్యూహాలు రచిస్తోంది. విశాఖ కేంద్రంగా కూటమి సరికొత్త గేమ్ షురూ చేసింది. రుషికొండ భవనాలపై చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది. రాజకీయంగా ఉత్తరాంధ్రకు కూటమి పార్టీలు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాయి. ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. ఉత్తరాంధ్రలో వైసీపీ వీక్‌గా ఉన్న చోట్ల తమ బలాన్ని పెంచుకోవాలని కూటమి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.