మండలి ఛైర్మన్‌ను అవమానించారనడం సరికాదు: అచ్చెన్న

AP: అసెంబ్లీ ప్రాంగణంలో కొత్తభవనం ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్‌ పేరు పెట్టలేదని, ప్రారంభోత్సవానికి ఆయన్ను ఆహ్వానించలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన మహిళా సదస్సుకూ ఆయనకు ఆహ్వానం లేదన్నారు. ఆహ్వానపత్రికలో మండలి ఛైర్మన్‌ పేరు లేకపోవడానికి కారణాలు తెలుసుకుంటామన్న మంత్రి అచ్చెన్నాయుడు.. చంద్రబాబుకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. మండలి ఛైర్మన్‌ను అవమానించారనడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్