తుపానుపై చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు: వైఎస్‌ జగన్‌

మొంథా తుపానును ప్రభుత్వ యంత్రాంగం సమర్ధవంతంగా ఎదుర్కొందని, అధికారులు అద్భుతంగా పనిచేశారని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శించారు. 18 నెలల కూటమి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంట నష్ట పరిహారం కింద ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో వైసీపీ హయాంలో అందరికీ ఇ-క్రాప్‌, ఉచిత పంటల బీమా జరిగి ఉంటే విపత్తు సమయంలో భరోసా ఉండేదని, ఈ పథకాన్ని రద్దు చేయడం బెటర్‌ మేనేజ్‌మెంట్‌ అవుతుందా అని నిలదీశారు.

సంబంధిత పోస్ట్