AP: ప.గో జిల్లాలోని పాలకొల్లులో 'మొంథా' తుపాను ప్రభావిత ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ సీఎంగా ఉన్నప్పుడు తుపాను సమయాల్లో బారికేడ్లు పెట్టుకుని రైతులను పరామర్శించడానికి వెళ్లారని విమర్శించారు. నేడు జగన్‌కు అన్నదాతలను పరామర్శించే అర్హత లేదన్నారు. ఏ విపత్తు వచ్చినా జగన్ బాధితులను నేరుగా కలవలేదని, నష్టపరిహారం కూడా మంజూరు చేయలేదని మంత్రి నిమ్మల ఆరోపించారు.